రాష్ట్రంలో ఒక్క రూపాయి డబ్బు పంచకపోయినా గెలిచేది వైఎస్ జగన్మోహన్‌రెడ్డేనని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఇతర పార్టీల సభ్యులు ఎవరైనా గెలిచినా వారిని జైల్లో పెడతారని వ్యాఖ్యానించారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చట్టం ఉపయోగపడుతోందని, ప్రతిపక్షాలకు కాదని అన్నారు. సోమవారం జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయొద్దని తాను చంద్రబాబుకు తాను చెప్పానని వెల్లడించారు. అయితే ప్రజలు మారారని, పోటీ చేద్దామని తనను చంద్రబాబు కన్విస్ చేసేందుకు ప్రయత్నించారని అన్నారు. కొత్త చట్టాలు తెచ్చినందుకు జనం జగన్‌కు జేజేలు కొడుతున్నారని, అయితే ఆ చట్టం అందరికీ వర్తిస్తేనే మంచిదన్నారు. జగన్ దూకుడుకు నేను తాను భయపడ్డాను కాబట్టే స్థానిక ఎన్నికల్లో మా వర్గం వాళ్లను పోటీకి దింపట్లేదని జేసీ దివాకర్ రెడ్డి వెల్లడించారు.
పార్టీలన్నీ కలిసినా గెలిచేది జగనే.. భయంతో వణికిపోతున్నా.. టీడీపీ నేత జేసీ సంచలన వ్యాఖ్యలు