BJP vs YSRCP: జగన్ పార్టీపై వార్ మొదలెట్టిన బీజేపీ.

బీజేపీ, వైఎస్సార్సీపీ మధ్య జాతీయ స్థాయిలో స్నేహం కొనసాగుతుండగా.. రాష్ట్ర స్థాయిలో మాత్రం వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అమిత్ షా సూచనల మేరకు అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీకి జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనున్నారనే వార్త ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌‌గా మారింది. బీజేపీ, వైఎస్సార్సీపీ మధ్య స్నేహ బంధం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. మూడు రాజధానుల దిశగా జగన్ సర్కారు అడుగులేస్తుండగా.. ఇది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రం స్పష్టం చేసింది. కాగా, అమరావతికి మద్దతుగా ఏపీ బీజేపీ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం వేరే, బీజేపీ వేరే అన్నట్టుగా ఉంది కమలనాథుల వైఖరి. బీజేపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య మైత్రి కొనసాగుతుండగానే.. ఏపీ బీజేపీ జగన్ పార్టీపై సెటైర్లు వేసింది. File Doesn't Exist అంటూ కంప్యూటర్ ఫోల్డర్ల భాషలో విమర్శలు గుప్పించింది.